epaper
Wednesday, February 18, 2026
epaper

విజయ్ సభలో మరో విషాదం.. డీహైడ్రేషన్‌‌తో కార్యకర్త మృతి

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టీవీకే పార్టీ బహిరంగ సభలో విషాదం చోటుచేసుకుంది. సేలంలో నిర్వహించిన భారీ ర్యాలీకి పార్టీ చీఫ్, నటుడు విజయ్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో జనసందోహం విపరీతంగా పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సభకు వచ్చిన వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. విపరీతమైన ఎండ, ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురై కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు (Police) వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీగా తరలివచ్చే జనానికి తగిన ఏర్పాట్లు చేయడంలో లోపాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>