తప్పులతడకగా విజయ్ నామినేషన్ పత్రాలు.. అఫిడవిట్‌పై దుమారం

కలం, వెబ్ డెస్క్: టీవీకే అధినేత విజయ్‌కు (TVK chief Vijay) షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. చెన్నై పెరంబూర్ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయ్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో వరుసగా దొర్లుతున్న పొరపాట్లు చర్చనీయాంశంగా మారాయి. గత నెల 30న దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తన మొత్తం ఆస్తుల విలువ రూ. 404 కోట్లు అని పేర్కొన్నాడు. తాజాగా ఏప్రిల్ 4న సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో మాత్రం తనకు రూ. 410 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఆస్తుల లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. సమాచారాన్ని తప్పులతడకగా పొందుపరచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలోనూ విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్ ఇదే తరహా గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. వరుసగా తప్పులతో కూడిన పత్రాలను సమర్పించడం అభ్యర్థి చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆస్తుల వివరాలను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ఒకే అభ్యర్థి వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాల్లో పొంతన లేని వివరాలు ఇవ్వడం ఎన్నికల అధికారుల దృష్టికి చేరింది. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>