పాత్రికేయుల డిమాండ్లు పరిష్కరించాలి: టీయూడబ్ల్యూజే

కలం, నిర్మల్: పాత్రికేయుల సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని ఐజేయూ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే (TUWJ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ‘డిమాండ్స్‌ డే’ (Demands Day) నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండూరి రవీందర్, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులు, మీడియా సంస్థల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మీడియా ఉద్యోగులకు కొత్త వేతన మండలి ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్‌ కార్డులు, క్యాష్‌లెస్‌ వైద్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>