బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్‌కు బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్!

కలం, వెబ్​ డెస్క్​: బాలీవుడ్ లో మరోసారి బెదిరింపులు కలకలం సృష్టించింది. నటుడు తుషార్ కపూర్‌ (Tusshar Kapoor) కు బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఫోన్​ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. రూ.5 కోట్లు డిమాండ్​ చేశారు. తాను లారెన్స్​ బిష్ణోయ్ గ్యాంగ్​ సభ్యుడినంటూ హ్యారీ బాక్సర్ పేరుతో వార్నింగ్​ ఇచ్చాడు.

దీంతో వెంటనే అప్రమత్తమైన తుషార్​ కపూర్​ (Tusshar Kapoor) ముంబై పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్రైమ్​ బ్రాంచ్​ టిక్నికల్​ టీమ్ వాయిస్​ రికార్డును క్షుణ్ణంగా పరిశీలించింది. తమ వద్ద ఉన్న హ్యారీ బాక్సర్​ అసలు వాయిస్​ తో పరిశీలించి చూశారు. అయితే, ఈ రెండు వాయీస్​ లో మ్యాచ్​ కాకపోవడంతో ఫేర్​ కాల్​ వచ్చినట్లు పోలీసులు నిర్దారణకు వస్తున్నారు.

కాగా, ఇటీవలే నటుడు టైగర్ ష్రాఫ్​ లక్ష్యంగా చేసకుని బిష్ణోయ్​ గ్యాంగ్​ కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో నటుడికి బెదిరింపులు రావడం గమనార్హం. తుషార్​ మెహతాకు ఫేక్ బెదిరింపు​ కాల్​ రావడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read : ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్.. రూ.29 లక్షలు స్వాహా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>