epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

టీటీడీ ఈవో సింఘాల్​ బదిలీ.. రవిచంద్రకు బాధ్యతలు

కలం, వెబ్​ డెస్క్​ : టీటీడీ ఈవో (TTD EO) అనిల్​ కుమార్​ సింఘాల్​ (Anil Kumar Singhal) పై ఏపీ ప్రభుత్వం బదిలీ (Transferred ) వేటు వేసింది. జీఏడీలో రిపోర్ట్​ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం సీఎం ముఖ్యకార్యదర్శిగా ఉన్న రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సరైన చర్యలు తీసుకోలేనందున చర్యలు తీసుకోవాలని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చింది. దీంతో ప్రభుత్వం సింఘాల్​ ను బదిలీ చేసింది. తక్షణమే అదనపు ఋవో వెంకయ్య చౌదరికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఈవోగా అనిల్​ కుమార్ సింఘాల్​ టీటీడీ ఈవోగా ఉన్నారు.

Read Also: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>