విద్యారంగ పరిరక్షణకు టీఎస్ యుటిఎఫ్ తీర్మానాలు

కలం, బోనకల్ : ముదిగొండలో(Mudigonda) నిర్వహించిన టీఎస్ యుటిఎఫ్ (TSUTF) ఖమ్మం జిల్లా ఏడవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు బోనకల్ మండలానికి చెందిన ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మహాసభల్లో పలు తీర్మానాలు(Teachers Demands) చేసినట్లు తెలిపారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, గురుకుల ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా వేతనాలు చెల్లించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సద్దాబాబు, మండల అధ్యక్షుడు చిన్న రంగారావు, ఉపాధ్యక్షుడు పి. గోపాలరావు, ఉపాధ్యక్షురాలు సౌభాగ్యలక్ష్మి, కోశాధికారి పి. నరసింహారావు, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ జల్లా కోటయ్య, ఆడిటర్ నరేంద్రసింహ, కార్యదర్శులు సురేష్, రామారావు, నిర్మల, రాణి, నారాయణ, కె. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>