జర్నలిస్టుల బస్‌ పాస్ కోసం కలెక్టరేట్‌లో TSJU వినతి

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు రాయితీతో కూడిన స్టేట్ బస్‌ పాస్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్‌ (TSJU) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్‌‌లో వినతిపత్రం అందజేశారు. గతంలో నియోజకవర్గస్థాయి పాత్రికేయులకు రాయితీ స్టేట్ బస్‌ పాస్ సౌకర్యం ఉండేదని అన్నారు.

ప్రస్తుతం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులకు ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్‌ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల హైదరాబాద్‌‌లో నిర్వహించే అధికారిక సమావేశాలకు పాత్రికేయులు హాజరుకావాల్సి ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా విధి నిర్వహణ కోసం ప్రయాణించాల్సి వస్తున్నందున రాయితీతో కూడిన స్టేట్ బస్‌ పాస్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>