పదవీ విరమణ పొందిన పోలీసులకు ఎస్పీ ఘన సన్మానం

కలం,యాదాద్రి భువనగిరి: భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కు (Bhuvanagiri Police) చెందిన ఎస్‌ఐ రామకృష్ణ రెడ్డి , ఏఎస్‌ఐ వీరేశం పదవీ విరమణ సందర్భంగా సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో వారు అందించిన సుదీర్ఘ సేవలను, విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావం, క్రమశిక్షణ, నిజాయితీ, వృత్తి నిబద్ధత , ప్రజాసేవా దృక్పథాన్ని అభినందించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో వారు అందించిన సేవలు పోలీస్ శాఖకు విలువైనవని, వారి అనుభవం .. సేవా స్ఫూర్తి యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు, ప్రజలకు అంకితభావంతో సేవలందించినందుకు ఎస్‌ఐ రామకృష్ణ రెడ్డి, ఏఎస్‌ఐ వీరేశంలకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.విరమణ అనంతరం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన , సంతోషకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>