కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (Inter Supplementary Exams) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం మే 13వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజును చెల్లించేందుకు బోర్డు అవకాశం కల్పించింది. థియరీ పరీక్షల అనంతరం మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ ఫలితాల విషయంలో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా బోర్డు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ 13 నుంచి 20వ తేదీ వరకు స్వీకరించనున్నారు. విద్యార్థులు ఈ గడువులోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే వారు ఈ తేదీలను గమనించి సకాలంలో ప్రక్రియను పూర్తి చేసుకోవాలని బోర్డు సూచించింది.
Read Also: అమర్‌నాథ్ యాత్ర షెడ్యూల్ రిలీజ్
Follow Us On: Instagram

