కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఎల్ నినో (El Nino) ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. వచ్చే మూడు నెలల పాటు 35–40 శాతం వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 122 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం ఉండొచ్చని.. అక్కడ పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలే సాగు..
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగును పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. అలాగే, పంటల రక్షణ బీమా, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాల వారీగా కార్యాచరణ తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు వివరించారు.
Read Also: డ్రగ్స్ కేసులో ఈడీ వేట.. ఏకకాలంలో 15 చోట్ల సోదాలు!
Follow Us On : WhatsApp

