కరీంనగర్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా మారుస్తాం: మేయర్ శ్రీనివాస్

కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన ‘వన మహోత్సవం’ (Van Mahotsav) కార్యక్రమాన్ని 53వ డివిజన్ సాయి నగర్‌లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) ఘనంగా ప్రారంభించారు. నగరాన్ని కేవలం ‘క్లీన్ సిటీ’ గానే కాకుండా ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’గా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నగర మేయర్ తెలిపారు.

వన మహోత్సవం (Van Mahotsav) ప్రారంభోత్సవంలో భాగంగా సాయి నగర్‌లో ఒకే రోజు సుమారు 500 మొక్కలను నాటారు. నగర వ్యాప్తంగా ప్రతి ఇంటికి రెండు చొప్పున పూలు లేదా పండ్ల మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని గృహాలకు 3 లక్షల మొక్కలను పంపిణీ చేయడంతో పాటు వివిధ డివిజన్లలో సుమారు లక్ష మొక్కలను నాటే లక్ష్యాన్ని నగరపాలక సంస్థ నిర్దేశించుకుంది.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న అనుకూల సమయంలో మొక్కలు నాటితే అవి సులభంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ, కరీంనగర్‌ను ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ గా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థకు సహకరించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేత రమన్, వంగల పవన్ కుమార్, కాలనీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, స్థానికులు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>