Mobile Popup Ad
Mobile Popup Ad

హర్మూజ్ జలసంధి ఇక తెరిచే ఉంటుంది: ట్రంప్

కలం, వెబ్ డెస్క్: ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని అధ్యక్షుడు ట్రంప్ (Trump) ఫ్రాన్స్ వేదికగా ప్రకటించారు. హర్మూజ్ జలసంధి తెరిచారని, నౌకలు రాకపోకలు సాగిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఈ జలసంధి తెరుచుకుంటుందని.. ఇక ఎలాంటి ఆంక్షలు ఉండబోవన్నారు. ఇరాన్ నాయకులతో తమ ఒప్పందం చాలా బాగా జరిగిందని, మూడో స్థాయి వ్యక్తులు చాలా తెలివైనవారని, బలవంతులు కూడా అన్నారు. గతంలో రెండు సార్లు దాడులు చేసినందుకు తాను ఇప్పుడు బాధపడుతున్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అన్నింటికన్నా ముఖ్యమైన విషయం చమురు ధరలు దిగి రావడమే కాకుండా, స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయని వివరించారు. ఇక అన్నింటికన్నా మరో ముఖ్యమైన అంశం.. తాము ఎన్నటికీ అణ్వాయుధం తయారు చేయబోమని ఇరాన్ స్పష్టంగా చెప్పిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇక నుంచి ఇరాన్, అమెరికా మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని తాను ఆశిస్తున్నట్లు వివరించారు. మేం చాలా గొప్ప పని చేశామని, ఎక్కడ మొదలుపెట్టామో.. తిరిగి అక్కడకే వెళ్లబోతున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ మాటలను బట్టి చూస్తే.. ఇరాన్ అత్యున్నత నేతల సమక్షంలో కాకుండా సుప్రీం నేతలు నియమించిన మూడో కేటగిరీ వ్యక్తులతో ఒప్పందం జరిగినట్లు అర్థమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>