సంగ‌మేశ్వ‌ర ఆల‌యాన్ని చుట్టుముట్టిన వ‌ర‌ద‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో శ్రీశైలం ప్రాజెక్టుకు వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో నంద్యాల (Nandyal) జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ శ్రీ సంగమేశ్వర ఆలయాన్ని (Sangameswara Temple) వ‌ర‌ద నీరు చుట్టుముట్టింది. కృష్ణా జలాలు క్షేత్రాన్ని చుట్టుముట్టడంతో నీటిమట్టం పెరిగింది. వేపదారు శివలింగానికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ గంగమ్మ తల్లికి చీర, సారె సమర్పించారు. కృష్ణా జలాలు సంపూర్ణంగా ముంచెత్తడంతో ఈ వేపదారు శివలింగం కొద్ది నెలల పాటు నీటిలోనే భక్తులకు దర్శనమివ్వనుంది. ఆల‌యాన్ని వ‌ర‌ద చుట్టుముట్టినా భ‌క్తులు ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తూనే ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>