Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన (TRS) జెండా పండుగను ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ప్రారంభించారు. కాసేపటి క్రితం కుత్బుల్లాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభమైన ఈ జెండా పండుగ కార్యక్రమం నెల రోజులు అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు.

ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల జెండా పండుగ నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకుని కవిత ఎమోషనల్ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మించి 20 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 లోగా అమరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. గడువులోగా ప్రారంభించకుంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో తామే స్వయంగా స్థూపాన్ని ఆవిష్కరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>