Mobile Popup Ad
Mobile Popup Ad

సీనియర్ సిటిజెన్లపై కవిత సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సీనియర్ సిటిజెన్లపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత (kavitha ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ సిటిజెన్లపై అనేక దాడులు జరుగుతున్నాయని ఆమె అన్నారు. సీనియర్ సిటిజెన్లు ఫిర్యాదు చేయడానికి వస్తే గౌరవంగా కూర్చోబెట్టి స్వీకరించే ప్రత్యేక విభాగం ఉండాలనే అంశమే పోలీసులకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. పోలీస్ స్టేషన్ లో సీనియర్ సిటిజెన్ల కంప్లైట్ పై సపరేట్ రిజిస్టర్ మెంటైన్ చేయాలని కొత్తగా నియామకమైన డీజీపీ సీపీ ఆనంద్ ను కోరారు. అలాగే సీనియర్ సిటిజెన్లపై గేరియాట్రిక్ విధానం ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు.

సీనియర్ సిటజెన్లకు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకోవద్దని సూచించారు. 65 ఏండ్ల తర్వాత వృద్ధుల ఆరోగ్య సమస్యలు, బాధలను పట్టించుకోడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలన్నారు. తమ పార్టీ సీనియర్ సిటిజెన్ల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వారి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకొస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>