కలం, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) ఇప్పుడు సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ (Vijay)తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు రావడం, అదే సమయంలో విజయ్ భార్య విడాకులు కోరడం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో విజయ్‌తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకకు హాజరుకావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై ప్రముఖ తమిళ దర్శకుడు పార్తీబన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిష కొన్ని రోజులు ఇంట్లోనే ఉండటం మంచిదని, ఆమె బయటకు వస్తే అనవసరమైన సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై త్రిష సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. మైక్ పట్టుకున్నంత మాత్రాన చేసే వ్యాఖ్యలు తెలివైనవిగానో, కామెడీగానో మారిపోవని ఆమె చురకలు అంటించింది.
“జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్యకర పదాలు, ఆ మాటలు అన్న వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి తప్ప.. ఎవరిని ఉద్దేశించి అన్నారో వారిని కాదు. మైక్ ఉంటే తెలివి తక్కువతనం మరింత గట్టిగా వినిపిస్తుంది అంతే” అంటూ త్రిష తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక విజయ్‌తో కలిసి వెళ్లడంపై స్పందిస్తూ.. ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా కోరడం వల్లే ఆ కార్యక్రమ నిర్వాహకులు చివరి నిమిషంలో తన పేరును, ఫోటోను ఆహ్వాన జాబితాలో చేర్చారని ఆమె క్లారిటీ ఇచ్చింది.

