epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు

కలం, వరంగల్ బ్యూరో: ములుగు జిల్లా మేడారంలో నిర్వహించనున్న క్యాబినెట్ సమావేశం (Medaram Cabinet Meet) నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌కు హాజరయ్యే ముఖ్యమంత్రి, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజనుల ఆహార సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ విందును రూపొందిస్తున్నట్లు మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. ఆమె పర్యవేక్షణలో విందు భోజనాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

జిల్లాలో సహజంగా లభించే పదార్థాలతోనే వంటకాలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజనుల జీవన విధానం, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేలా మెనూను రూపొందించామని చెప్పారు. విందులో ఇప్ప పువ్వుతో చేసిన లడ్డు, కరక్కాయ చాయ్, ఇప్ప పువ్వు టీ, రాగి జావా వంటి సంప్రదాయ పానీయాలు, ఆహార పదార్థాలు ఉండనున్నాయి.

అదేవిధంగా జొన్న రొట్టె, గోదావరి ప్రాంతానికి చెందిన చేపలు, రొయ్యల వంటకాలు, బొంగు చికెన్ వంటి ప్రత్యేక గిరిజన వంటకాలను కూడా వడ్డించనున్నారు. ఈ విందు ద్వారా గిరిజనుల సంస్కృతి, ఆహార సంపదను రాష్ట్రస్థాయిలో పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సీతక్క వివరించారు. మేడారం కేబినెట్ సమావేశం (Medaram Cabinet Meet) నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ గిరిజన సంప్రదాయ విందు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది.

Read Also: నేటి నుంచి నాగోబా జాతర

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>