కలం, వెబ్డెస్క్: స్వర్గీయ ఎన్టీఆర్ పేదల పెన్నిధి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్థంతిని పురస్కరించుకొని ఆదివారం సీఎం చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని తన ట్వీట్లో పేర్కొన్నారు. సినీవినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ నందమూరి తారక రామారావు (NTR) అని అన్నారు.
‘ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనకందరికీ ప్రాత:స్మరణీయుడు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రత పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థలతో స్థానిక పాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగు నీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. ఆయన వేసిన బాట అనుసరణీయం’ అని తన ట్వీట్లో సీఎం చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు.
Read Also: సీఎం, మంత్రులకు గిరిజన సంప్రదాయ వంటకాలతో విందు
Follow Us On: X(Twitter)


