సిబ్బందికి ట్రాన్స్‌కో హెచ్చరిక.. టైమ్ వేస్ట్ చేస్తే చర్యలు

కలం, డెస్క్ : ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGTRANSCO) తన సిబ్బందికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొందరు ఉద్యోగులు విద్యుత్ సౌధతో పాటు కార్పొరేట్ ఆఫీసుల్లో కూడా పనిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ట్రాన్స్ కో (Transco) తెలిపింది. సంస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీని వల్ల పనికి ఆటంకం కలుగుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే సిబ్బందిని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగులు వర్కింగ్ టైమ్ లో కచ్చితంగా ఆఫీసులోనే పని చేయాలని తెలిపింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపు ఎప్పుడైనా 30 నిముషాలు లంచ్ బ్రేక్ తీసుకోవాలని స్పష్టం చేసింది. పని వేళల్లో రోమింగ్ చేయడం, బిగ్గరగా మాట్లాడటం లేదా అనధికారిక మీటింగ్ లు పెట్టడం పూర్తిగా నిషేధిస్తున్నట్టు ట్రాన్స్ కో చెప్పింది. కంట్రోలింగ్ అధికారులు ఈ రూల్స్ సిబ్బంది పాటించేలా చూసుకోవాలని.. రూల్స్ పాటించని వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్ కో హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>