కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా కొల్చారం మండలం రాంపూర్ వద్ద నేషనల్ హైవే NH 765 D పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ఆర్టీసీ బస్సు ఢీకొని.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నర్సాపూర్ వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీ కొట్టడంతో స్పాట్ లోనే మృతిచెందారు. మృతులు హావేలిఘనపూర్ మండలం బురుగుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో తండ్రి కొడుకులు అమృత్ గౌడ్(51), రిషి వర్ధన్(14)తో పాటు బొగడ భూపతి పూర్ కు చెందిన సాయ గౌడ్ (32) గా గుర్తించారు.
Read Also: ముగిసిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు
Follow Us On: Instagram

