రికార్డు సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యుత్ శాఖ (Power Department) రికార్డు సృష్టించింది. మార్చి 13న ఒక్క రోజే 341.08 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా (Electricity Supply) చేసింది. మార్చి 13, 2026న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది. ఇప్పటి వరకు తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్రలోనే ఇదే అత్యధిక సరఫరా అని అధికారులు చెబుతున్నారు. గతంలో 335.19 మిలియన్ యూనిట్లను 18-03-2025 రోజున సరఫరా చేయగా.. మొన్నటి దాకా అదే అత్యధిక సరఫరాగా ఉంది.

అలాగే గతంలో 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను 20-03-2025 రోజున తీర్చగా.. నిన్న 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను నెరవేర్చింది విద్యుత్ శాఖ. వేసవి సమీపించడం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయ అవసరాలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ అవసరాలు ఏర్పడుతాయని.. వాటిని తీర్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరాలను అలాగే 19వేల మెగా వాట్ల గరిష్ట లోడ్ ను కూడా నిర్వహించేందుకు విద్యుత్ శాఖ (Power Department)  సిద్ధంగా ఉందని చెప్పారు.

డిప్యూటీ సీఎం ప్రశంసలు..

విద్యుత్ సరఫరాలో చరిత్ర సృష్టించినందున అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసించారు. రాబోయే రోజుల్లో మరింత ధీటుగా పనిచేయాలని సూచించారు.

Read Also: ఎల్పీజీ కష్టాలకు చెక్.. ఆల్టర్నేట్‌గా డీఎంఈ..

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>