Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం పోలీస్ శభాష్.. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam)లో ట్రాఫిక్ పోలీసులు హెవీ వెహికల్ డ్రైవర్ల (Heavy Vehicle Drivers)కు ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చలనాలు రాస్తూ విధులకే పరిమితమవుతుంటారు. కానీ ఖమ్మం ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో హెవీ వెహికల్స్ నడిపే డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేయించి, రోడ్డు భద్రతలో పాటించాల్సిన నియమాలను వివరించారు. ఈ శిబిరం ద్వారా 110 మందికి పైగా డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం బుధవారం ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. వయస్సు పెరిగేకొద్ది కంటి చూపు మందగించడం సహజమని, విధిగా కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చాలామంది డ్రైవర్లు కంటిచూపును అశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

Read Also: టీచర్‌పై పిడి గుద్దులు.. టెన్త్ స్టూడెంట్ దాడి

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>