Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో తనిఖీలు.. 140 వాహనాలు సీజ్

కలం, ​కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా TVS XL వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు సంజీవ్, అంజయ్య, సిబ్బంది నిఘా పెట్టారు. ​ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 140 వాహనాలను తాత్కాలికంగా నిర్బంధించి, ఎంవీ యాక్ట్ ప్రకారం జరిమానాలు విధించారు. అనంతరం వాహనదారులకు పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి హెచ్చరించారు. పట్టణంలో రహదారి భద్రత కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ ఏసీపీ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>