భగత్ సింగ్ త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం

కలం, భైంసా: భైంసా ( Bhainsa) పట్టణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ 119వ జయంతి (Bhagat Singh Jayanti) వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తపస్ జిల్లా అధ్యక్షుడు గోనెల శశిరాజ్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో యువతకు స్ఫూర్తినిచ్చిన మహోన్నత విప్లవ యోధుడని అన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ధైర్యం, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. భగత్ సింగ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని శశిరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TPUS నాయకులు జి. రాజేశ్వర్, నవీన్ కుమార్, ధీరజ్ కులకర్ణి, విఠల్ రెడ్డి, ఆర్. రాజేశ్వర్, దత్తురాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>