కలం, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ (Putta Madhukar) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి, పార్టీ విదానాలు నచ్చక బీఆర్ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు. మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొత్తవడ్ల సదానందం సహా పలువురు మధుకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వారికి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు చింతలపూడి దేవేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు కాసిపేట సమ్మయ్య, మాజీ యూత్ అధ్యక్షులు కాసిపేట రమేష్, కాసిపేట ప్రభాకర్, నాంపల్లి దేవయ్య, కాసిపేట ఫణి పాల్గొన్నారు.

