Mobile Popup Ad
Mobile Popup Ad

జీవన్ రెడ్డి రాజీనామా‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రియాక్షన్

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాజీనామాకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్‌రెడ్డిని (Jeevan Reddy) బుజ్జగించినా అయన వెనక్కి తగ్గలేదు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానంటూ తేల్చిచెప్పాడు. అనుకున్నట్టుగా రాజీనామా చేసి కాంగ్రెస్ ‌పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్‌ (TPCC Chief) మహేష్‌గౌడ్ స్పందించారు. ‘‘జీవన్‌రెడ్డి సీనియర్‌ నేత.. మంత్రి శ్రీధర్‌బాబు, నేను నచ్చజెప్పే ప్రయత్నం చేశాం.. ఆయన వినలేదు.. రాజీనామా చేశారు.. తెలంగాణలో ప్రతిపక్షమే లేదు.. ఏ పార్టీలోకి వెళ్తారు? ఓ పార్టీలో కుటుంబ గొడవలు జరుగుతున్నాయి.. బీఆర్ఎస్‌ దోపిడీ పార్టీ, బీజేపీ తెలంగాణలో మొలకెత్తే అవకాశమే లేదు’’ అని మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>