Mobile Popup Ad
Mobile Popup Ad

దొడ్డు బియ్యం పేరిట కేసీఆర్ కుటుంబం జేబుల్లోకి వేల కోట్లు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు బియ్యం పేరితో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాలయలను జేబుల్లో వేసుకుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Goud) ఆరోపించారు. ఆదివారం యాదాద్రి భువనగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యాన్ని తిని పేదలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఒక చెటాకు బియ్యం కూడా అమ్ముకోవడం లేదని చెప్పారు. ఇదంతా ప్రభుత్వం గొప్పతనం అని, సీఎం రేవంత్ రెడ్డి విజన్ అని మహేశ్ గౌడ్ కొనియాడారు.

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రూ.5 లక్షల ఇన్సూరెన్స్ నిర్ణయం దేశ చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం అని పీసీసీ చీఫ్ (TPCC Chief) చెప్పుకొచ్చారు. రెడ్డి బిడ్డ అయి ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల సర్వేను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. బ్రిటీష్ పాలన తరువాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను చేపట్టి రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ సర్వే చెపట్టినందునే పీఎం మోడీ దేశ వ్యాప్తంగా కుల సర్వే చేస్తామని చెబుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వెల్లడించారు.

Read Also: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

Follow Us On: Instagram

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>