కలం, వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) జారీ ప్రక్రియలో తెలంగాణ రవాణా శాఖ కీలక మార్పులు తీసుకువస్తోంది. ఇకపై లైసెన్స్ పొందాలంటే పాత రెండు పరీక్షలతో పాటు మరో అదనపు టెస్ట్ తప్పనిసరి కానుంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ టెస్ట్‌లతో పాటు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేయాలి. ఈ కొత్త విధానం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని రవాణా శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఏటా 1.7 లక్షల మంది, తెలంగాణలో సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తిగా ఆన్ లైన్‌లో నిర్వహించే ఈ టెస్ట్‌కు తప్పనిసరిగా హాజరుకావాలి. మొత్తంగా మూడు గంటల వ్యవధి గల ఈ పరీక్షను ఇంటి వద్దే పూర్తి చేయొచ్చు. డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి కూడా ఈ పరీక్షకు హాజరుకావొచ్చు. ఈ టెస్ట్‌లో మొత్తం 6 మాడ్యూళ్లు ఉంటాయి. ఒక్కొ మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈ పరీక్ష పాస్ అయితేనే ఒక ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ను జారీ చేస్తారు. దీని ఆధారంగా ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

