Mobile Popup Ad
Mobile Popup Ad

వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌లో ఈ దేశాలు టాప్..

కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో ఉద్యోగ జీవితంలో ఒత్తిడి పెరగడం షరా మామూలు అయిపోయింది. పని వేళలు ముగిసిన తర్వాత కూడా చాలా సంస్థలు ఉద్యోగస్తులను వదలడం లేదు. పని వేళలు అయిన తర్వాత కూడా ఏదో ఒక పని చెప్తూనే ఉంటున్నాయి. దీంతో ఎక్కువ గంటలు పనిచేయడం, ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండడం చాలామందికి అలవాటైపోయింది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం వర్క్ లైఫ్ – పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్‌(Work Life Balance)కు పెద్దపీట వేస్తున్నాయి. ఉద్యోగ సమయం పూర్తయ్యాక వ్యక్తిగత జీవితాన్ని కూడా సమానంగా ఆస్వాదించేందుకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో ఐదు దేశాలు ప్రస్తుతం టాప్‌లో ఉన్నాయి. ఆ దేశాలు ఏవంటే..

నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లో సాధారణంగా వారానికి 30 నుంచి 36 గంటల పని మాత్రమే ఉంటుంది. పార్ట్-టైమ్ ఉద్యోగాలు కూడా విస్తృతంగా కనిపిస్తాయి. ఉద్యోగులు తమ పని గంటలను తగ్గించాలని కోరుకునే హక్కు అక్కడ చట్టపరంగా ఉంది. అదనంగా కనీసం 20 రోజుల చెల్లింపు సెలవులు కూడా లభిస్తాయి. పని తర్వాత కుటుంబానికి సమయం కేటాయించడాన్ని అక్కడి సంస్కృతి ప్రోత్సహిస్తుందని పేర్కొనబడింది.

డెన్మార్క్

డెన్మార్క్‌లో సాధారణ పని సమయం వారానికి 37 గంటలు. అక్కడ ఉద్యోగులపై నమ్మకం ఆధారంగా పని విధానం కొనసాగుతుంది. పని పూర్తయితే సమయానికి ఇంటికి వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. కనీసం ఐదు వారాల చెల్లింపు సెలవులు ఉండటంతో పాటు తల్లిదండ్రులకు విస్తృతమైన సెలవు విధానం కూడా అమల్లో ఉంది. ఉద్యోగి పని నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారని పేర్కొనబడింది.

స్వీడన్

స్వీడన్‌లో అధికారికంగా వారానికి 40 గంటల పని ఉన్నప్పటికీ, పని సమయాల్లో సౌలభ్యం ఉంటుంది. కుటుంబ జీవితాన్ని కాపాడేందుకు అక్కడ ప్రత్యేక విధానాలు అమల్లో ఉన్నాయి. తల్లిదండ్రులకు మొత్తం 480 రోజుల చెల్లింపు సెలవు ఇవ్వబడుతుంది. అదనంగా ప్రతి సంవత్సరం కనీసం 25 రోజుల చెల్లింపు సెలవులు కూడా ఉంటాయి.

జర్మనీ

జర్మనీలో పని సమయాలు సాధారణంగా వారానికి 34 నుంచి 40 గంటల మధ్య ఉంటాయి. పని సమయంలో పూర్తి క్రమశిక్షణతో పనిచేయడం అక్కడి ఉద్యోగ సంస్కృతిలో భాగం. పని ముగిసిన తర్వాత విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా 20 నుంచి 30 రోజుల చెల్లింపు సెలవులు కూడా ఉద్యోగులకు లభిస్తాయి.

ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో పని-జీవిత సమతుల్యతకు చట్టపరమైన రక్షణ ఉంది. అక్కడ సాధారణ పని వారానికి 35 గంటలుగా నిర్ణయించబడింది. పని సమయం తర్వాత వచ్చిన మెసేజ్‌లు లేదా ఇమెయిల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదని చెప్పే “రైట్ టు డిస్కనెక్ట్” చట్టం అమల్లో ఉంది. అదనంగా ఐదు వారాల చెల్లింపు సెలవులు కూడా తప్పనిసరిగా ఉంటాయి.

Read Also: సంజీవని శకలం పడిన క్షేత్రం.. చాల్కాపూర్ హనుమాన్ ఆలయం

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>