విల్ జాక్స్ ఇంటికి.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ ఎవరంటే?

క‌లం, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేయి విరగడంతో వైస్ కెప్టెన్ విల్ జాక్స్ (Will Jacks) మిగిలిన టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మేరకు ఇంగ్లండ్ బోర్డు నేడు అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 21న మెల్‌బోర్న్‌లో జరిగిన తొలి టీ20లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ చివరికి ముందు ఓవర్లో బెన్ డ్వార్షుయిస్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు జాక్స్ ప్రయత్నించాడు. ఆ సమయంలో బంతి వేగంగా తగిలి జాక్స్ చేతి వేళ్ల మధ్య చీలిపోయింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది.ఆదివారం ఉదయం వైద్య పరీక్షల్లో జాక్స్ చేతికి ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో డిసెంబర్ 2న కాన్‌బెర్రాలో ముగియనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పటికే హ్యారీ బ్రూక్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం ముందుగానే ఆసీస్ నుంచి వెళ్లిపోవాల్సి ఉండటంతో, జాక్స్ జట్టును నడిపించాల్సి ఉంది. ఇప్పుడు జాక్స్ కూడా గాయపడటంతో కాన్‌బెర్రాలో జరిగే చివరి టీ20కి టామ్ బాంటన్‌ (Tom Banton)ను కెప్టెన్‌గా నియమించారు. జాక్స్ స్థానంలో స్కాట్ క్యూరీని జట్టులోకి తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 17న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం జోర్డాన్ కాక్స్ జట్టుతో కలవనున్నాడు. తదుపరి సిరీస్‌లకు జాక్స్ అందుబాటుపై వైద్యుల నివేదిక తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>