బాసర సర్కిల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

కలం, నిర్మల్ : తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాసర సర్కిల్ (Basara Circle) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. 2026–2029 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బాసర సర్కిల్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రణీత్ కౌర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించగా, ఖానాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. నూతన అధ్యక్షుడిగా టి. పుండలిక్ (వర్ని), ఉపాధ్యక్షురాలిగా అనిత (బాసర), ప్రధాన కార్యదర్శిగా జి.వి. రామకృష్ణ (నిర్మల్), సంయుక్త కార్యదర్శిగా పద్మారావు (జగిత్యాల), కోశాధికారిగా రవి మోహన్ భట్ (ఇందల్వాయి), ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాథోడ్ అవినాష్ (ఆదిలాబాద్) ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>