Mobile Popup Ad
Mobile Popup Ad

బంగారు స్వామినాథం వర్ధంతి.. ఘన నివాళులర్పించిన టీఎన్జీవోలు

కలం, కరీంనగర్ బ్యూరో: కీర్తిశేషులు టీఎన్జీవోల మాజీ రాష్ట్ర అధ్యక్షులు బంగారు స్వామినాథం (Bangaru Swaminatham) వర్ధంతి సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు ఆధ్వర్యంలో కరీంనగర్‌ (Karimnagar) లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ హాజరై స్వామినాథం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా, తాలూకా నాయకులు, వివిధ శాఖల ఉద్యోగ సంఘ ప్రతినిధులు స్వామినాథం విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్వామినాథం ఆశయాలను కొనసాగిస్తూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. బంగారు స్వామినాథం ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఉద్యోగ సంఘాల కార్యకలాపాలకు శాశ్వత వేదికలు ఉండాలనే సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిరంతరం చర్చించి రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఉద్యోగ సంఘ భవనాల నిర్మాణానికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవం, ఉద్యోగుల స్వాభిమాన పరిరక్షణ కోసం కూడా స్వామినాథం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. తెలంగాణకు మద్దతుగా నిర్భయంగా తన గొంతును వినిపించినందుకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. ఉద్యోగులను అవమానించే వ్యాఖ్యలను ఏనాడూ సహించకుండా, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అధికారులను, పాలకులను సైతం నిర్భయంగా ప్రశ్నించిన ధీశాలి నాయకుడు స్వామినాథం అని కొనియాడారు.

స్వామినాథం చూపిన మార్గం, వారి ఆశయాలు, విలువలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొంటూ వారి వారసులుగా ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, తెలంగాణ ఉద్యోగుల ఆత్మగౌరవం కోసం అదే స్ఫూర్తితో టీఎన్జీవోలు నిరంతరం పనిచేస్తాయని మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా, తాలూకా నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కీర్తిశేషులు బంగారు స్వామినాథం విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపెల్లి కాళీ చరణ్ గౌడ్, రాగి శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు ఇరుమల్ల శారద, జిల్లా సహాధ్యక్షులు రవీందర్ రెడ్డి, పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్ , తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, జిల్లా నాయకులు గంగారపు రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, సరిత, శైలజ, సూర్య కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, బరిగల శ్రీనివాస్, ఆకుల జీవన్, లవ కుమార్, బోనాల రవి, రాజశేఖర్ రెడ్డి, రెవెన్యూ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, మల్కా రాజేశ్వరరావు, కామ సతీష్, జలాలుద్దీన్ అక్బర్, లక్ష్మీకాంతయ్య, తాళ్లపల్లి రమేష్, శ్రీనాథ్, శంషుద్దీన్, శ్రీనివాస్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>