మార్చి 20న కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet Meeting) మార్చి 20న జరగనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు క్యాబినెట్ సమావేశమై ఆమోదించడం ఆనవాయితీ. ప్రతీ బడ్జెట్ రోజున లాంఛనంగా సెషన్ ప్రారంభం కావడానికి గంట ముందు ఇలాంటి క్యాబినెట్ భేటీ అసెంబ్లీ భవనంలోని మీటింగ్ హాల్‌లోనే జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ సమావేశం జరగడం రొటీన్ ప్రాక్టీస్. ప్రభుత్వ ప్రయారిటీలకు అనుగుణంగా ముందుగానే చర్చించి తర్వాత బడ్జెట్ రూపొందుతుంది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే వాటిని చేర్చడంపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. క్యాబినెట్ సమావేశానికి వివిధ శాఖల అధికారులు కూడా హాజరవుతారు.

Read Also: ఐ వాంట్ నయనతార.. ఏఐఏడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Us On: Facebook

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>