క‌ర్నూలు పోలీసుల‌పై మంత్రి భ‌ర‌త్ సీరియ‌స్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: క‌ర్నూలు పోలీసుల‌పై మంత్రి టీజీ భ‌ర‌త్ (Minister TG Bharath) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేత ఇంతియాజ్ హ‌త్య పై పోలీసులు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించారు. క‌ర్నూలులో రౌడీయిజం పెరిగిపోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నిఘా పెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కర్నూలులో పోలీసుల నిఘా వైఫల్యమైంద‌ని విమ‌ర్శించారు.

టీడీపీ నేత ఇంతియాజ్ హ‌త్య‌కు వారం ముందే సోష‌ల్ మీడియాలో పోస్టులు వైర‌ల్ అయ్యాయ‌ని, రిప్ అంటూ ప‌లువురు పోస్టులు పెట్టార‌ని చెప్పారు. అలాంటి వారిపై పోలీసులు ఎందుకు నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించార‌ని నిల‌దీశారు. మంత్రులు ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌శ్నించే పోలీసులు నేర‌స్థులు ఏం చేస్తున్నార‌నే దానిపై దృష్టి పెట్ట‌లేక‌పోయారా అని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇంతియాజ్ హ‌త్య‌ను క‌ర్నూలు ఎస్పీ సీరియస్‌గా తీసుకోవాల‌ని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>