కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ దివ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం శ్రీవారిని 95,094 మంది భక్తులు దర్శించుకోగా.. 35,909 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లువచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఆర్పీఎస్జీ (RPSG) అధినేత సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) విరాళంగా ఇచ్చారు. స్వామివారికి వజ్రఖచితమైన ‘కటి హస్తం’, ‘వరద హస్తం’ ఆభరణాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం టీటీడీ అధికారులకు విరాళాన్ని అందజేశారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

