హైదరాబాద్ కోసం ఎన్ని నిధులైనా ఇస్తా : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్ ను తీర్చి దిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth). హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా ఇస్తానని.. ఎక్కడి నుంచైనా నిధులు తీసుకొస్తానని చెప్పారు. హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన నాలాలు, కుంటలు, చెరువులను పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు సీఎం రేవంత్ (Revanth) వెల్లడించారు. పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో చెరువులను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేస్తే ఎవరూ పట్టించుకోలేదని.. కాంగ్రెస్ హయాంలో చెరువులను కాపాడుతున్నామని తెలిపారు.

చెరువుల దగ్గర మహిళలు, పెద్దవారు, చిన్న పిల్లలకు భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ లేక్ మీద మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువలను అమ్ముకునేలా స్టాళ్లను ఏర్పాటు చేయిస్తామని సీఎం వెల్లడించారు. ‘చెరువులు కేవలం ఆహ్లాదం కోసమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థ కోసం కూడా ఉపయోగిస్తాం. ఓల్డ్ సిటీలో అర్ధరాత్రి వరకు బిజినెస్ లు జరుగుతున్నాయి. కానీ కొన్ని సార్లు పోలీసుల నిబంధనలు మీకు ఇబ్బంది కలిగిస్తోంది. కాబట్టి రాత్రి ఒంటిగంట వరకు బిజినెస్ లు చేసుకోడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో నైట్ మొత్తం వ్యాపారాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని సీఎం రేవంత్ చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>