Mobile Popup Ad
Mobile Popup Ad

సిరిసిల్లలో పెద్దపులి సంచారంతో టెన్షన్

క‌లం, వెబ్ డెస్క్‌: రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారంతో గ్రామాల్లో భయాందోళన నెలకొంది. గత కొద్ది రోజులుగా జిల్లాలో పెద్దపులి తిరుగుతోంది. పలు గ్రామాల్లో ఆవులపై దాడులు చేయడం, పలుచోట్ల పులి తిరిగిన ఆనవాళ్లు కనబడటంతో స్థానికులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ప్రస్తుతం పులి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పులి నాలుగు ఆవుల‌పై దాడి చేసి చంపేసింది. దీంతో హైద‌రాబాద్‌లోని అట‌వీ శాఖ బృందం రంగంలోకి దిగింది. పులిని గుర్తించేందుకు అధికారులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. చుట్టు ప‌క్క‌ల గ్రామాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. రైతులు ఒంట‌రిగా పొలాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని, చిన్న‌ పిల్ల‌లను ఒంట‌రిగా ఎక్క‌డికి పంపించ‌వ‌ద్ద‌ని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>