షాకింగ్ ఇన్సిడెంట్… ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తిపై పులి దాడి!

కలం, వెబ్ డెస్క్ : ఇంగ్లండ్‌లోని ప్రముఖ యార్క్‌షైర్ వైల్డ్ లైఫ్ పార్క్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జంతు ప్రదర్శనశాలలోని ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ఒక వ్యక్తిపై అరుదైన అమూర్ టైగర్ (Tiger Attack) తీవ్రంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు సౌత్ యార్క్‌షైర్ పోలీసులు వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు.

ఎయిర్ అంబులెన్స్ ద్వారా వైద్యులు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు దూకాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అనూహ్య ఘటనతో అప్రమత్తమైన జూ సిబ్బంది వెంటనే సందర్శకులను బయటకు పంపి పార్క్‌ను ఖాళీ చేయించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వారాంతం మొత్తం జంతు ప్రదర్శనశాలను మూసివేస్తున్నట్లు పార్క్ యాజమాన్యం ప్రకటించింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>