రూట్ క్లియర్: భక్తుల కోసం విజయవాడలో డిజిటల్ పార్కింగ్!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోకి భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం నగర పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టింది. భక్తుల వాహనాలను సులభంగా నిలుపుకునేందుకు వీలుగా నగరం నలుమూలలా దాదాపు 40 పార్కింగ్ స్థలాలను పోలీసులు సిద్ధం చేశారు.

భక్తులు పార్కింగ్ ప్రదేశాలను సులువుగా గుర్తించేందుకు, వాహన రద్దీ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లను (QR Codes) అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని విభిన్న ట్రాఫిక్ మళ్లింపు పాయింట్ల వద్ద ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా, పార్కింగ్ స్థలాల లొకేషన్లు, ఖాళీల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘అస్త్రం’ యాప్‌(Astram App)లో సమాచారాన్ని అప్‌డేట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భక్తులు తమ వాహనాలను నిర్దేశిత ప్రదేశాల్లో సురక్షితంగా నిలుపుకోవాలని విజయవాడ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Also Read : గిరిజన ప్రాంతాలకు పక్కా రోడ్లు.. నేడే ‘అడవితల్లి బాట 2.0’ కు శ్రీకారం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>