జాతీయ రహదారిపై లారీలు, కార్లు ఢీ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాణ్‌పల్లి (Chandrayanpalli) శివారులో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు లారీలు, రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కామారెడ్డి నుంచి ఇందల్వాయి వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నా.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>