జైలుకు తరలిస్తుండగా ట్విస్ట్.. ఒంగోలులో ముగ్గురు ఖైదీలు పరారీ!

కలం, వెబ్ డెస్క్ : చీరాల కోర్టుకు హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా ఒంగోలు రైల్వే స్టేషన్‌లో పోలీసుల కళ్లుగప్పి ముగ్గురు అంతరాష్ట్ర దొంగలు (Ongole Prisoners Escape) పరారయ్యారు. ఈ నెల 18న ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని ఐదో ప్లాట్‌ఫారమ్ వద్ద ఎస్కార్ట్ పోలీసుల కస్టడీ నుంచి వీరు తప్పించుకున్నారు. పరారైన అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యప్రదేశ్‌కు చెందిన సంతోష్ బూరియా (24), భూరు మాక్స్వానా అలియాస్ భూరు సాధన్ బిల్ (40), రమేష్ మర్చార్ అలియాస్ రేమో (19)గా గుర్తించారు. వీరు చీరాల, మార్కాపురం ప్రాంతాల్లో జరిగిన దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

కోర్టు విచారణ అనంతరం బాపట్ల జిల్లా ఏఆర్ పోలీసుల ఎస్కార్ట్ బృందం వీరిని తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ (17291) రైలులో ఒంగోలు జైలుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఒంగోలు స్టేషన్‌కు చేరుకున్న సమయంలో పోలీసుల ఏమరుపాటును ఆసరాగా చేసుకుని నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తొలుత గోప్యత పాటించినప్పటికీ, తాజాగా ఒంగోలు జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 125/2026, బీఎన్ఎస్ సెక్షన్ 262 కింద కేసు నమోదు చేశారు. పరారైన ఖైదీలను పట్టుకునేందుకు ప్రకాశం, బాపట్ల జిల్లాల ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్ఐ టి. శ్రీరామ్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>