కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 22 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన రైతు ఉత్సవాల(Public Administration Farmers’ Festival) కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఆహ్వానం అందింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ముఖ్యమంత్రిను కలిసి ఆ మేరకు ఆహ్వానాన్ని అందించారు.ప్రభుత్వం “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యాచరణలో భాగంగా ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులపాటు “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” నిర్వహిస్తోంది.
అందులో భాగంగా ఈ నెల 22న జనగామ జిల్లా నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు. దానికి సమీపంలో రూ. 80 కోట్లతో నిర్మించనున్న రిఫైనరీ యూనిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి స్థానిక రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడిన అనంతరం తొలివిడత రైతుభరోసా నిధులను విడుదల చేస్తారు.
Read Also: తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం.. బీఆర్ఎస్‌కు త్వరలో గుడ్ డేస్!
Follow Us On: Instagram

