Mobile Popup Ad
Mobile Popup Ad

వయసుకంటే ముందే ముడతలు వస్తున్నాయా? రోజువారీ పొరపాట్లు ఇవే

కలం, వెబ్‌డెస్క్: ఒకప్పుడు వయసు పైబడిన వారిలో చర్మం ముడతలు పడేది. కానీ నేటి కాలంలో చిన్న వయసులోనే చర్మం ముడతలు (Premature Skin Wrinkles) రావడం మనం చూస్తున్నాం. దీనికి కారణం మన మారుతున్న జీవనశైలి. అయితే చర్మం ముడతలు రావడానికి వయసు ఒక్కటే కారణం కాదట.. మన రోజూవారీ జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మనం చర్మం ముడతలు పడేందుకు కారణం అవుతాయిని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండ ప్రభావం

బయట ఎండలో తిరిగినప్పుడు మన చర్మంపై సూర్యరశ్మి ప్రభావం పడుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఎండలోకి వెళ్లేవారు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. ఇటువంటి రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.

మేకప్ తోనే నిద్రపోవడం

షూటింగ్‌లు, ఆఫీసులకు వెళ్లేవారు మేకప్ వేసుకుని వెళతారు. అయితే ఇంటికి వచ్చాక రాత్రి పడుకునేముందు వేసుకున్న మేకప్‌ను తొలగించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. లేదంటే మేకప్ ఉత్పత్తుల్లో ఉండే ఫ్రీ రాడికల్స్, కాలుష్య కారకాలు.. ఇవన్నీ చర్మంపై ప్రభావం చూపించి ముడతలు పడేలా చేస్తాయని చెబుతున్నారు. కాబట్టి మేకప్‌తో అలాగే నిద్రించడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు.

శరీర బరువులో వచ్చే మార్పులు..

మన శరీర బరువులో వచ్చే మార్పులు కూడా చర్మంపై ముడతలు రావడానికి కారణం అవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒకేసారి బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరిగినపుడు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. దీనివల్ల చర్మం సాగినట్లుగా.. ముడతల్లా కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

పోషకాలు సరిగ్గా అందకపోవడం

వార్దక్యపు ఛాయలు కనిపించకుండా చేయడంలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరలు మన ఆహారంలో భాగం కావాలట. చర్మ సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు సగిగ్గా అందనపుడు ఆ ప్రభావం తప్పకుండా చర్మం మీద కనిపిస్తుందంటున్నారు నిపుణులు.

శారీరక శ్రమ లేకపోవడం

మనం చర్మం యవ్వనంగా కనిపించడంలో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఉన్నచోటే అదే పనిగా కూర్చుని ఉంటే శరీరానికి వ్యాయామం అందక ఆ ప్రభావం చర్మంపై కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మంపై ముడతలు వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>