ఆర్టిజన్ల సమ్మెకు డెడ్‌లైన్ ఫిక్స్.. రేపటిలోగా చేరకుంటే…

కలం, వెబ్ డెస్క్: వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు తెలంగాణ ట్రాన్స్‌కో (TGTRANSCO) సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సమ్మె విరమించి విధుల్లో చేరాల్సిందిగా ఇప్పటికే పలుమార్లు హెచ్చరించామని, అయినా సమ్మె కొనసాగించడంపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై శాఖాపరంగా నిబంధనలకు లోబడి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై లోతుగా ఆలోచించింది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సమ్మెను విరమించి విధుల్లో చేరాలని చివరి అప్పీల్ చేసింది. ఇందుకోసం నిర్దిష్టంగా డెడ్‌లైన్ విధించింది. ఏప్రిల్ 16 ఉదయం 11 గంటలకల్లా విధుల్లో చేరుతున్నట్లు సంబంధిత విభాగం హెడ్‌కు రిపోర్టు చేయకుంటే టర్మినేట్ చేసినట్లుగానే భావించాలని తాజాగా జారీచేసిన సర్క్యులర్‌లో ఆర్టిజన్లను సీఎండీ హెచ్చరించారు. సమ్మె నుంచి బయటకు వచ్చి విధుల్లో చేరడానికి 24 గంటల సమయం ఇస్తున్నామని, ఆలోచించుకుని వివేకమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఏప్రిల్ 15 ఉదయం ఈ సర్క్యులర్‌ను జారీచేశారు.

ఆర్టిజన్ల పెండింగ్ సమస్యలకు పరిష్కారంపై ఒకవైపు ప్రక్రియ మొదలైందని, సంస్థ నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో ఉండగానే, ఆరు నెలల సమ్మెపై నిషేధం అమల్లోకి వచ్చినా సమ్మెను కొనసాగించడాన్ని సీఎండీ తప్పుపట్టారు. సంస్థ ప్రయోజనాలకు భంగం కలిగించేలా, నిబంధనలను ఉల్లంఘించేలా వ్యవహరిస్తూ సమ్మె చేస్తున్న ఆర్టిజన్లకు ఇదే చివరి హెచ్చరిక అని, ఏప్రిల్ 16న ఉదయం 11 గంటలకు విధుల్లో చేరకుండా ఉన్న ఆర్టిజన్లందరూ ఆటోమేటిక్‌గా టెర్మినేట్ అయినట్లుగానే భావించాలని తాజా సర్క్యులర్ మెమోలో స్పష్టం చేశారు. ‘తెలంగాణ ఎస్మా చట్టం’లోని సెక్షన్ 3(1)(3) ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్టిజన్ కార్మికుల డిమాండ్ల పరిష్కారం విషయం ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నదని, దానిపై స్పష్టమైన నిర్ణయం (తీర్పు) వెలువడకుండానే సమ్మె చేయడం నిబంధనలకు విరుద్ధమని నొక్కిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>