కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) నాగిరెడ్డి (Nagi Reddy) పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. సంక్లిష్టమైన అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, అందుకు సుమారు నాలుగు వారాల సమయం పడుతుందని తెలిపారు.
ఈ సమయంలో సహనంతో వ్యవహరించాలని కార్మికులకు సూచించారు. కొన్ని సంఘాలు కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించిన ఎండీ, ప్రలోభాలకు లొంగకుండా విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని.. సమ్మెను విరమించి సహకరించాలని నాగిరెడ్డి (Nagi Reddy) కోరారు.

