సినీ పరిశ్రమలో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత

కలం, వెబ్​ డెస్క్​ : తెలుగు చలనచిత్ర (Tollywood) పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నిర్మాత, సీనియర్ ఫిల్మ్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు (Tripuraneni Chittibabu) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కొండాపూర్‌లోని సింధు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సినీ రంగంపై అపారమైన అవగాహన ఉన్న చిట్టిబాబు (Tripuraneni Chittibabu), నిర్మాతగానే కాకుండా చలనచిత్ర విశ్లేషకుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిట్టిబాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని సినీ లోకం నివాళులు అర్పిస్తోంది.

Read Also: ‘భూధార్’తో రిజిస్ట్రేషన్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>