Mobile Popup Ad
Mobile Popup Ad

నర్సంపేటకు చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం

కలం, వరంగల్ బ్యూరో: న‌ర్సంపేట‌ (Narsampet)లో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ నేడు తెల్ల‌వారు జామున‌ మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం స్వగ్రామం ముత్తోజీపేటకు చేరుకుంది. మృతదేహన్ని ఆర్టీసీ డిపో వద్దకు తరలించాలని కార్మికులు పట్టుబట్టడంతో వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్త్ చర్యలు చేపట్టారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు భారీఎత్తున శంక‌ర్ గౌడ్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌ర్సంపేట‌లో భారీ ఎత్తున పోలీస్ బ‌ల‌గాలు మోహ‌రించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>