కలం, వెబ్ డెస్క్: కల్తీ ఆహారం, అపరిశుభ్ర పరిసరాలు ఇలా అన్ని కలిసి కస్టమర్ల ఆరోగ్యంతో కొన్ని హోటల్లు చెలగాటమాడుతున్నాయి. అధికారులు తనఖీలు చేపడుతున్నా నిర్వాహకుల ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా, హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు మరోసారి బయటపడ్డాయి. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల రెట్టలు, కుళ్లిన ఆహార పదార్థాలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఖంగుతిన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో TG-SAFE ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలీసులతో కలిసి హైదరాబాద్ లోని తనిఖీలు (Raids) చేపట్టారు.
తనిఖీల్లో (TG SAFE Raids) హోటళ్లకు లైసెన్సులు లేకపోవడం, వంటగదుల్లో గుట్కా మరకలు, బొద్దింకలు, కుళ్లిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగుల వాడుతున్నట్లు గుర్తించారు. అలాగే, వెజ్, నాన్ వెజ్ ఆహార పదార్థాలను కలిపి నిల్వ ఉంచినట్లు వెలుగులోకి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన మాదాపూర్లోని బావర్చి (అయ్యప్ప సొసైటీ), ది స్పైస్ కిచెన్ (కూకట్పల్లి), మతం అల్ యమనీ (టోలిచౌకి), అన్నపూర్ణ క్యాటరర్స్ (చందానగర్) లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. అల్ కరీం బేకర్స్ (టోలిచౌకి), శ్రీ లక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ (గౌలిదొడ్డి) లన క్లోజ్ చేయించారు. తనిఖీల్లో సుమారు 135 కిలోల పాడైన ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు. రాజుగారి బిర్యానీ (చైతన్యపురి), స్వాద్ స్పైసీ (నాగోల్) సహా నాలుగు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read : అనిరుధ్ – కావ్య పెళ్లి.. ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్!
Follow Us On : WhatsApp

