అనిరుధ్​ – కావ్య పెళ్లి.. ఉద్యోగులకు సర్‌ప్రైజ్​​ గిఫ్ట్స్​!

కలం, వెబ్​ డెస్క్: సన్​ రైజర్స్​ హైదరాబాద్​ జట్టు సహ యజమాని, సన్​ గ్రూప్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ కావ్య మారన్ (Kavya Maran)​ తన పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు భారీ సర్​ ప్రైజ్​ ఇచ్చారు. సన్​ గ్రూప్​ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు అందించిన గిఫ్ట్ బాక్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. ఓ ఉద్యోగి బహుమతులకు సంబంధించిన వీడియోను షేర్​ చేసిన వీడియోలో.. కావ్యా మారన్​ పంపిన గిఫ్ట్​ బాక్సుల్లో బంగారు ఉంగరాలతో పాటు చాక్లెట్లు, వెడ్డింగ్​ కార్డు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే, చెన్నై, హైదరాబాద్​ ఉద్యోగులకు స్పెషల్​ లంచ్ ఏర్పాటు చేశారు.

గ్రీస్​ లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్​

సెన్సెషనల్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనిరుధ్​ రవిచందర్​ ను కావ్యా మారన్​, నవంబర్​ 11 న గ్రీస్​ లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, నేడు (నవంబర్​ 21)న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్​ చోళ హోటల్​ లో అనిరుధ్​ – కావ్య (Anirudh – Kavya Maran) రిసెప్షన్​ వేడుక ఘనంగా జరగనుంది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Also Read : తెలుగు సినిమాలపై మళ్లీ పైరసీ పంజా..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>