కలం, వెబ్ డెస్క్: కేటీఆర్ సైగలు చేస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ‘తెలంగాణ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారు. ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా మరొకరికి అప్పగించాలి. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తెప్పించేలా చూడాలని కనీసం పది సార్లు లేఖలు రాసినా స్పందించలేదు. ప్రధాని మోదీకి రాష్ట్రం తరఫున ఒక్క లేఖ కూడా రాయలేదు. ఐఎఫ్‌ఎస్‌సీ అప్పు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఏం పని చేయడం లేదు. మల్కాజ్ గిరికి మెట్రో వస్తే ఈటల రాజేందర్‌కు పేరొస్తుందని ఆపుతున్నారు. ప్రాజెక్టుల ఆలస్యానికి ముమ్మాటికీ కిషన్ రెడ్డినే కారణం’ అని స్పష్టం చేశారు.

